Tirumala, June 24: తిరుమల (Tirumala) నడక దారిలో మూడేళ్ల బాలుడిపై రెండు రోజుల క్రితం దాడి చేసిన చిరుత (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లి తప్పించుకున్న చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు. దానిని పట్టుకునేందుకు అధికారులు నిన్న రెండు బోన్లు ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడింది.
Leopard which attacked a three year old boy at Alipiri-Tirumala pedestrian route captured pic.twitter.com/91ORlbNtzA
— Sandeep Raghavan@TOI (@Sandeep19689759) June 24, 2023
గుంపులుగా పంపాలని..
చిరుత దాడిలో గాయపడిన బాలుడిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ (3)గా గుర్తించారు. తొలుత తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చిరుత దాడి నేపథ్యంలో నడక మార్గంలో ఇకపై భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.