Credits: ANI

Hyderabad, June 24: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు (Trains) రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. రేపటి నుంచి జులై 3 వరకు వీటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మేడ్చల్ (Medchal) నుంచి సికింద్రాబాద్ (Secunderabad) మధ్య నడిచే రైళ్లను రేపు, ఎల్లుండి, కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను నేడు, 26న రద్దు చేశారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్ మధ్య నడిచే రైళ్లను ఎల్లుండి నుంచి జులై 3 వరకు రద్దు చేశారు.

Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం

ప్రయాణికులు సహకరించాలని..

కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసెంజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వేకు సహకరించాలని కోరారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ