Pedderu River Tragedy: విశాఖలో తీవ్ర విషాదం, పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి, తల్లి దండ్రుల ఆవేదనతో శోక సంద్రమైన జమ్మాదేవిపేట

విశాఖపట్నం జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన (Pedderu River Tragedy) చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్దేరు నదిలో మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్దేరు నది దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు (4 Children died after fell into Pedderu Revu) మరణించారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Visakhapatnam, July 27: విశాఖపట్నం జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన (Pedderu River Tragedy) చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్దేరు నదిలో మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్దేరు నది దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు (4 Children died after fell into Pedderu Revu) మరణించారు. మృతి చెందిన చిన్నారులు మహేందర్‌(7), షర్మిల(7), ఝాన్సీ(10), జాహ్నవిలను గౌరవరం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తమ కళ్లముందే తమ కంటిపాపలు నీటిలో మునిగిపోవడం చూసిన కన్నతల్లుల ఆవేదన అక్కడున్న వారిని కలిచివేసింది.

గవరవరం గిరిజన గ్రామంలో ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో వంతాల వెంకట ఝాన్సీ, వంతాల గౌతమి షర్మిల, వంతాల భవ్య జాహ్నవి, నీలాపు మహేంద్ర మధ్యాహ్నం అందరితో భోజనాలు చేసి ఆటలాడుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఈ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ఉతకడానికి పెద్దేరుకు వెళ్తుంటారు. తమ తల్లులు సైతం మధ్యాహ్నం 3 గంటల తరవాత పెద్దేరు రేవుకు బయలుదేరడంతో వారితోపాటే ఝాన్సీ, జాహ్నవి, మహేంద్ర, గౌతమి సరదాగా రేవు వద్దకు వెళ్లారు.

నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన, గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ఆరుగురు గల్లంతు, మృతదేహాలు లభ్యం

ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దేరు నది దాటుతుండగా వీరు బట్టలు ఉతికే చోటుకు సమీపంలో పెద్ద ఊబి ఏర్పడింది. ఆ ఊబిలో నలుగురు చిన్నారులు కూరుకుపోయారు. చిన్నపిల్లలు కావడంతో పైకి రాలేక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలేశారు. క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరగడం కళ్లారా చూసిన తల్లులు అచేతనులై ఉండిపోయారు. విషయం తెలపడంతో గ్రామస్థులు పరుగున వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ఈసారి వర్షాలకు ఊబి ఏర్పడిందనే విషయం ఎవరికీ తెలియకపోవడం తీవ్ర విషాదానికి కారణమైంది.

టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై విప్‌ బూడి ముత్యాలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల ద్వారా ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన ఘటనపై అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే ఎంపీడీఓ పోలినాయుడు, ఇన్‌ఛార్జి తహసీల్దారు సత్యనారాయణ, ఎస్సై రామారావు సిబ్బందితో వెళ్లారు.

అస్సాం-మిజోరం స‌రిహ‌ద్దు వివాదం ఏమిటి? సమస్య ఎప్పటి నుంచి రగులుతోంది, 5 గురు అస్సాం పోలీసులు మృతితో మళ్లీ అక్కడ సమస్య తీవ్రరూపం, అస్సాం-మిజోరం స‌రిహ‌ద్దు వివాదంపై ప్రత్యేక కథనం

పసిపిల్లల మృతదేహాలను ఎక్కడికో తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయొద్దని తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. దీంతో ఎంపీడీఓ పోలినాయుడు, వైసీపీ మండల అధ్యక్షుడు తాళపురెడ్డి రాజారామ్‌ కలిసి ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో ఫోన్‌లో సంప్రదించి వైద్యులను గ్రామానికి పిలిపించారు. ఊబిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన

Birthright Citizenship in US: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, దానికోసం ప్రపంచమంతా అమెరికాకు రావడానికి ఎగబడితే ఎలా అంటూ సూటి ప్రశ్న

Share Now