Narendra Modi on Train Accident: విజయనగరం రైల్ ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి, సహాయ కార్యక్రమాలపై రైల్వే మంత్రి తో మాట్లాడిన మోడి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.
Vijayanagaram, OCT 29: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఘోర రైలు (AP train Accident) ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.