President Kovind AP Tour: రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి, కోవింద్‌కు స్వాగతం పలికేందుకు రేణి గుంటకు చేరుకున్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు
కాగా మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy ramachandra reddy) ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Amaravati, Feb 7: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనందుకు (President Kovind AP Tour) అనుమతినిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి తరుపున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత అతనిపై ఉందని న్యాయస్థానానికి వివరించారు. పటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నది.
రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పిన విషయం తెలిసిందే.
నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని ఎస్ఈసీని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ విధానమని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. మరోవైపు.. పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా ఇద్దరి తరఫున న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు మరికొద్దిసేపట్లో కీలక తీర్పును ఇవ్వనుంది.