Raghu Rama Krishnam Raju Case: ట్విస్టులతో సాగుతున్న ఎంపీ కథ, ఆ గాయాలు అంతా అబద్దమని తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన సీఐడీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నరసాపురం ఎంపీ

కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు (Special court) ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌ ( judicial custody) విధించింది.

YSRCP Rebal MP K Raghu Ramakrishna Raju (Photo-ANI)

Amaravati, May 16: నరసాపురం ఎంపీ కేసు (Raghu Ramakrishna Raju Case) ట్విస్టుల మధ్య సాగుతోంది. కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు (Special court) ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌ ( judicial custody) విధించింది.

శనివారం సాయంత్రం సీఐడీ పోలీసులు (CID Police) ఆయన్ను గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల ఆరవ అదనపు, గుంటూరు సీబీసీఐడీ కోర్టు జడ్జి కె.అరుణ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్య సాయం అవసరమని, పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి తెలిపారు.

ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్, రమేష్‌ ఆసుపత్రిల్లో వైద్యులు పరీక్షించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నడుమే వైద్యుల పరీక్ష ప్రక్రియ కొనసాగాలని పేర్కొన్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్, రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించారు. అంతకు ముందు హైకోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేయడంతో సీఐడీ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించింది.

అనంతరం రఘురామకృష్ణరాజును (YSRCP Rebal MP K Raghu Ramakrishna Raju) కోర్టుకు తరలించారు. రిమాండ్‌ రిపోర్టులో సాంకేతిక తప్పిదాలు ఉండటంతో వాటిని సరిచేయాలని కోర్టు సీఐడీ అధికారులకు సూచించింది. ఆ తప్పిదాలను సరిచేసి, తిరిగి సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆయనపై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు చేశారు.

రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు, CRPC 124 (A) సెక్షన్‌, 120 (B) IPC సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన సీఐడీ

తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్‌ కోర్టులో చెప్పడంతో, ఆ గాయాల నిగ్గు తేల్చేందుకు హైకోర్టు శనివారం మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు ఆయన్ను శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో, ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణ హైకోర్టుకు లేఖ రాశారు.

ఈ లేఖను హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఈ లేఖపై న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్‌ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ శనివారం రఘురామకృష్ణరాజు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారని తెలిపారు. హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు.

గాయాల పరిశీలనకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల తాము పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. గాయాల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, సూపరింటెండెంట్‌ సిఫారసు చేసే మరో డాక్టర్‌తో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు తక్షణమే రఘురామకృష్ణరాజును మెడికల్‌ బోర్డు ముందు హాజరు పరచాలంది. గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్‌ బోర్డును ఆదేశించింది.

నేడు ఎంపీని మరోసారి విచారణ చేయనున్న సీఐడీ, నిన్న అర్ధరాత్రి వరకు విచారణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు, నేడు విచారణకు రానున్న పిటిషన్

సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఈ విషయమై వివరణ కోరింది. ఆదినారాయణరావు ఆరోపణలను సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు కొట్టారనడం అబద్ధమని చెప్పారు. ఉదయం హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు.

మధ్యాహ్నం ఎంపీ కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. డాక్టర్‌ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచామని, అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు. కాగా సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్‌ నాయక్, గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు.

ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. రఘురామ భద్రతా సిబ్బందిని ఆస్పత్రిలోకి అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పింది. అనంతరం ధర్మాసనం రిమాండ్‌ రిపోర్ట్‌ గురించి ఆరా తీసింది. అరెస్ట్‌కు స్పీకర్‌ అనుమతి లేదన్న కారణంతో రిమాండ్‌ రిపోర్ట్‌ను కింది కోర్టు తిరస్కరించిందని ఆదినారాయణరావు చెప్పారు. స్పీకర్‌కు ఇప్పటికే అరెస్ట్‌ గురించి సమాచారం ఇచ్చామని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఎంపీని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదని, రిమాండ్‌ లేకుండా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 437, 438 ప్రకారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ఎంత మాత్రం విచారణార్హత లేదని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను సుధాకర్‌రెడ్డి ఉదహరించారు.

ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు బెయిల్‌ రద్దు చేసినప్పుడు దానిని సవాలు చేస్తూ బెయిల్‌ కోసం దాఖలు చేసే వ్యాజ్యాలనే వెకేషన్‌ కోర్టులో విచారిస్తారన్నారు. ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నింటినీ సెషన్స్‌ కోర్టులో చెప్పుకోవాలని తేల్చి చెబుతూ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం