MP Raghu Rama Krishna Raju (Photo:Twitter/RaghuRaju_MP)

Vijayawada, May 15: ఏపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని ఓ పథకం ప్రకారం కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో అరెస్టు (MP Raghu Rama Krishnam Raju Arrest) చేసిన సంగతి విదితమే.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని మణికొండ జాగీర్‌ గోల్ఫ్‌కోర్సు బౌల్డర్స్‌హిల్స్‌లోని విల్లా నెంబర్‌ 17లో ఉంటున్న ఆయన నివాసానికి శుక్రవారం వెళ్లిన సీఐడీ బృందం (Criminal Investigation Department (CID).. అరెస్టు కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు సెక్షన్‌ 50 నోటీసును జారీ చేసింది. అనంతరం ఆయన్ను అదుపులోకి (Kanumuri Raghurama Krishnam Raju's arrest) తీసుకున్నారు.

అయితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్టు చేయనీయకుండా అడ్డుపడ్డారు. వారికి సీఐడీ పోలీసులు అరెస్టుకు సంబంధించిన కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్బంగా రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుటుంబ సభ్యులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

అరెస్ట్ తరువాత నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును శుక్రవారం అర్ధరాత్రి వరకు సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో భాగంగా డీఐజీ సునీల్‌ పలు కోణాల్లో ప్రశ్నించారు. మొదటగా రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని, ఎవరి ప్రోదల్బంతో.. పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించింది.

 విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, వాటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దండి, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష

ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సాంకేతిక సహకారం అందించిన వారి గురించి సీఐడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం. ఇక అధికారులు కాసేపట్లో సీఐడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోసారి రఘురామకృష్ణరాజును సీఐడీ విచారించనుంది.

ఇదిలా ఉంటే నరసాపురం ఎంపీ అరెస్ట్ పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్ట్ చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై నేడు మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరపనుంది. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రాజుకు సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆహారం, వైద్యం వసతికి వెసులుబాటు కల్పించాలని కోర్టు పేర్కొంది.