AP Rains Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వానలు పడుతాయంటే?

ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Rains (photo-Video Grab)

Vijayawada, Nov 12: బంగాళాఖాతంలో (Bay of Bengal) నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ నెల 15, 16 తేదీల వరకు యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.

మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, CRPF బలగాల కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మృతి, భారత జవాన్లలో పలువురికి గాయాలు

ఈరోజు ఈ ప్రాంతాల్లో..

నెల్లూరు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

రేపు ఈ ప్రాంతాల్లో..

కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

ఎల్లుండి ఈ ప్రాంతాల్లో..

కృష్ణా, గంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, తమ్ముడు కొట్టాడని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, తన చావుకు కారణం తమ్ముడేనంటూ వీడియో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif