Andhra Pradesh: టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఖాతాలో మ‌రో రెండు విజ‌యాలు, శాస‌న మండ‌లిలోనూ పెరుగుతున్న బ‌లం

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు (MLCs) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్‌ (Hari prasad) మంగళవారం నామినేషన్లు వేశారు.

Ramachandraiah And Hariprasad (PIC@ Twitter)

Vijayawada, July 05: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు (MLCs) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్‌ (Hari prasad) మంగళవారం నామినేషన్లు వేశారు. పోటీగా నామినేషన్లు రాకపోవడంతో వారు ఏకగ్రీవంగా(Unanimously) ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శుక్రవారం ప్రకటించారు.సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైసీపీకి (YSRCP) రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా రెండు పదవులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ తప్పింది.

 

కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య టీడీపీ (TDP) హయాంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2008లో టీడీపీకి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిని అప్పగించింది. అనంతరం 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

జనసేన (Janasena) అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 164 మంది సభ్యులు గెలుపొందగా వైసీపీ కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement