Corporator Murder Case: కాకినాడ కార్పోరేటర్ దారుణ హత్య, గుంటూరులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, రియల్ ఎస్టేట్ వివాదంతో మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన నిందితుడు
నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన తరువాత పరారయ్యాడు. కాగా చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు గుంటూరులో పట్టుకున్నారు.
Amaravati, Feb 15: ఈ నెల 12వ తేదీన కార్పోరేటర్ రమేష్‌ను కాకినాడలో కారుతొ తొక్కించి దారుణంగా హత్య చేసిన సంగతి (Corporator Murder Case) విదితమే. నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన తరువాత పరారయ్యాడు. కాగా చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు గుంటూరులో పట్టుకున్నారు.
రియల్ ఎస్టేట్ (Real estate) విషయంలోనే ఇద్దరి మధ్యా వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ (YSRCP Corporator in Kakinada) దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్ అందుకు అంగీకరించ లేదు. అయితే చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్ కలిశాడు.
ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం ప్రకారం రమేష్‌పైకి కారుతో తొక్కించి చిన్నా కిరాతంగా హత్య చేశాడు. కాకినాడ వాకపూడి గానుగచెట్టు సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. హత్యకు ముందు రమేష్ ఇదే కార్ వాష్ షెడ్ లో మిత్రులతో కలసి మద్యం సేవించారు. ఆ తర్వాత ఇళ్లకు కార్లపై వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి నలుగురుపై కేసు నమోదు చేశారు.