![](https://test1.latestly.com/uploads/images/2025/01/suicide.jpg?width=380&height=214)
Kakinada, Feb 11: ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం అనే మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అర్ధరాత్రి వేళ సాయిరాం ఉరివేసుకొని ఉండటం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది వెంటనే సాయిరాంను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ నేత మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వారం క్రితం చోటు చేసుకుంది. కరీంనగర్ లో బోయినపల్లి శ్రీనివాస్ రావుకు చెందిన ప్రతిమ మెడికల్ కాలేజ్ లో విద్యార్థి ఆర్తి సాహు ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక గత నెలలో విజయనగరం నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థి సాయి మణిదీప్ ఆత్మహత్య చేసుకున్నారు.
Medical Students Dies by Suicide:
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య#AndhraPradesh #Kakinada #RangarayaMedicalCollegehttps://t.co/t0NU4H7RNE
— Sakshi (@sakshinews) February 11, 2025
బీఆర్ఎస్ నేత మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ లో బోయినపల్లి శ్రీనివాస్ రావుకు చెందిన ప్రతిమ మెడికల్ కాలేజ్ లో విద్యార్థి ఆర్తి సాహు ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశారు#Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP… pic.twitter.com/rkv9lCclsy
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 1, 2025
అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది అంటూ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
విజయనగరం - నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయి మణిదీప్ (24)
డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి.. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు
బతకాలంటే… pic.twitter.com/nkXLWmPIVQ
— Telangana Chitralu (@tgchitralu) January 20, 2025
డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి.. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. బతకాలంటే భయమేస్తోంది..8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు అంటూ లేఖ రాసి పురుగుల మంది తాగి కాలేజ్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు మణిదీప్.