IPL Auction 2025 Live

Road Accidents in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గుంటూరులో బైకును ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మార్కాపురంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

వేగంగా వేళ్తున్న ఓ కారు బైక్‌ను (Guntur Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి( Death) చెందారు.

Road accident (image use for representational)

Amaravati, May 10: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమూలూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వేళ్తున్న ఓ కారు బైక్‌ను (Guntur Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి( Death) చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుల్లో తాళ్లూరుకి చెందిన దంపతులు సహా కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ చినమస్తాన్‌ కుటుంబంతో బైక్ వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో అతనితో పాటు ఆయన భార్య, కుమారుడు తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మార్కాపురం పట్టణానికి చెందిన సూరె కోటేశ్వరరావు, ఆయన కుమారుడు వెంకటకృష్ణారావు కలిసి గుంటూరు వైద్యశాలకు వెళ్లి తిరిగి మార్కాపురం వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి కాలనీకి చెందిన కటికల ప్రసాద్‌ ఇంట్లోకి దూసుకువెళ్లింది.

మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా, రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి, పుట్టినరోజు వేడుకల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు

ప్రమాదంలో బాపూజీ కాలనీకి చెందిన డ్రైవర్‌ కటికల ప్రవీణ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన ఇద్దరిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ వెంకటకృష్ణారావు (31) మృతి చెందాడు. స్వల్ప గాయాలైన కోటేశ్వరరావుకు మెరుగైన వైద్యం నిమిత్తం పట్టణంలో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

కాలనీ దగ్గర కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ కాలనీకి పక్కన ఉన్న రోడ్డుకు ఇరువైపులా డైవర్షన్‌ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కారు డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వచ్చి ప్రమాదానికి గురయ్యారు. అ సమయంలో ఇంటి లోపల కటికల మేరికుమారి కుమారుడు పంచలో కూర్చొని ఉన్నాడు. వారికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి ముందు ఉన్న గోడను కారు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.