Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఏడుగురి దుర్మరణం.. మరో 15మందికి తీవ్ర గాయాలు..

నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కావలి ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది.

Road Accident in Nellore (Credits: X)

Nellore, Feb 10: నెల్లూరు (Nellore) జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.కావలి ముసునూరు (Kavali Musunur) టోల్‌ ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని (Lorry) వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఆ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Supreme Court Notice To Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ

CM Revanth Reddy Slams KCR: కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు ఇవ్వండని తెలిపిన ముఖ్యమంత్రి  

మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే చనిపోయిన ఏడుగురి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు అధికారులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif