Accident In Palnadu: పల్నాడులో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు కూలీలు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు, ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చి ఢీకొట్టిన లారీ

కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ (Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే (Five Laborers Died) మరణించారు.

Representational: Twitter

Vijayawada, May 17: ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ (Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే (Five Laborers Died) మరణించారు. స్థానికులు అంబులెన్సు సహాయంతో క్షతగాత్రులను స్థానిక గురజాల (Gurajala) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Temperatures Soar In Telugu States: నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత, మరో 3 రోజులు బయటకు రావొద్దని హెచ్చరికలు 

లారీ ఢీకొనడంతో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతుల్లో ఎక్కువగా ఆటో ముందుభాగంలో కూర్చున్నవారు ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా మిర్చి కూలీ పనులకు ఆటోలో వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన పొందుగల ప్రాంతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం.