Palnadu Road Accident: ప‌ల్నాడులో ప్రైవేట్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు, ఆరుగురు స‌జీవ ద‌హ‌నం, ఓటు వేసి తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా విషాదం

చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది (Accident). దీంతో క్షణాల్లో బస్సులో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

fire accident

Guntur, May 15: పల్నాడు జిల్లాలో (Palnadu) అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది (Accident). దీంతో క్షణాల్లో బస్సులో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ప్రయాణికుల జాడ ఇంకా తేలియలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీరు తమ స్వగ్రామాలకు వచ్చారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో జనగంజాం, గోనసపూడి, నీలాయపాలెం గ్రామాల వారు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం పరిధిలోని అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య కంకర టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు చలరేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారంతో పోలీసులు, స్థానికులు ఘటన స్థలం వద్దకు చేరుకొని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 

బైపాస్ వర్క్ జరుగుతుండటం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ప్రమాదం జరగడం, బస్సుకు మంటలు వ్యాపించడంతో అందరూ ఒక్కసారిగా బస్సు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు స్వల్ప గాయాల నుంచి బయటపడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నికీలలకు బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif