Vizag Knife Attack Case: జగన్‌పై కత్తి దాడి కేసు, ఆగస్టు 1న విచారిస్తామని తెలిపిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం

తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది.

NIA (Photo-ANI)

Vjy, July 25: తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై ఆగస్ట్ 1న విచారణ జరుపుతామని తెలిపింది.

అదే సమయంలో నిందితుడు శ్రీనివాస్‌ నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడని, అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా అదే రోజు విచారిస్తామని కోర్టు తెలిపింది. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారని.. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో రెగ్యులర్‌ విచారణకు హాజరుకావడం ఇబ్బంది మారిందని అతని తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దీనిపై న్యాయమూర్తి..రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ వివరణ కోరారు. దానికి జైలు సూపరింటెండెంట్ స్పందిస్తూ.. రాజమహేంద్రవరం జైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్‌ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుంచే విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు.

కోడికత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన ఎన్‌ఐఏ కోర్టు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి.ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కోర్టుకు హాజరు కావడానికి హైదరాబాద్ వెళ్లే మార్గంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఘటన చోటు చేసుకుంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబర్‌ 25న జరిగిన కత్తి దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు ఇప్పటికే తెలిపింది. తనపై కత్తితో దాడికి పాల్పడిన రాజకీయ కుట్రపై తదుపరి దర్యాప్తు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌ఐఏ కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అతని పిటిషన్‌ను కొట్టివేయాలని ఆ సంస్థ NIA కోర్టును కోరింది.