Vjy, Mar 14: గత ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి (YS Jagan Attack Case) జరగడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో(NIA court ) మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేష్‌ను న్యాయస్థానం విచారించింది. కేసుకు సంబంధించిన కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించారు.
అనంతరం విచారణను ధర్మాసనం వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.గత వారం కూడా విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy)పై కోడికత్తి (Kodi Kathi)తో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ ఎన్‌ఐఏ కోర్టులో జరిగింది.
విచారణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయనే కావడంతో విచారించారు. దినేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి విచారించారు.