Andhra Pradesh: మద్యం ప్రియులు గుండెలు బాదుకునే న్యూస్, రూ. 92 లక్షల విలువ గల 8800 బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లాలో ఘటన
కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు. తమ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని సీజ్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇలా ధ్వంసం (crushed under road Roller) చేశారు.
Rayachoti, June 15: మద్యం ప్రియులు కచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే ఇది. కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు. తమ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని సీజ్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇలా ధ్వంసం (crushed under road Roller) చేశారు. అన్నమయ్య జిల్లాలో ఘటన మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు.
తనిఖీల్లో పట్టుబడిన అక్రమ మద్యం 8800 బాటిళ్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రాయచోటిలోని గొల్లపల్లి సమీపంలో రింగ్ రోడ్డు పక్కన పెట్టారు. అక్కడ రోడ్డు రోలర్ సహాయంతో పోలీసులు మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు.
అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్‌స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు (Seized liquor bottles worth Rs 92 lakh) ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు