Skill Development Scam: ఎన్నికల వేళ చంద్రబాబు మెడకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఉచ్చు, ఏ1గా టీడీపీ అధినేతను పేర్కొంటూ 41 మందిని నిందితులగా పేర్కొన్న సీఐడీ

ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

Chandra babu Naidu (Photo-X/TDP)

Vjy, April 5: నైపుణ్యాభివృద్ధి సంస్థకు (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో నమోదు చేసిన కేసులో (Skill Development Scam) సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం అభియోగపత్రం(ఛార్జిషీట్‌) దాఖలు చేసింది.

స్కిల్‌ కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా (CID files chargesheet against 41 accused) సీఐడీ పేర్కొంది. ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.  వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పెన్సన్ కోసం వెళ్లిన వృద్ధులు చనిపోవడంపై ఏమన్నారంటే..

వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్‌లో పేర్కొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగంలో నిందితుల పాత్ర ఉందని సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు, 17ఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలు, కేసు సీజే బెంచ్‌కు బదిలీ

రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్‌ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది.

ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌– డిజైన్‌టెక్‌ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్‌ఎస్‌డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారని సీఐడీ పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అసలు ఏం జరిగింది..చంద్రబాబును అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే..

అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్‌ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లతో అక్రమంగా తరలించారు. షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్‌ తదితర షెల్‌ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తన ఛార్జిషీట్ లో పేర్కొంది.

ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా 52 రోజులు ఉన్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. గతంలో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణస్కిల్‌ స్కామ్‌లో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్‌బుక్‌ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్‌లో పూర్తి ఆధారాలతో పేర్కొంది.

మనీ లాండరింగ్‌ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్‌ స్కామ్‌ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్‌ కంపెనీ అప్పటి ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ ఖన్వేల్కర్, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ముకుల్‌ చంద్ర అగర్వాల్, షెల్‌ కంపెనీల సృష్టికర్త సురేశ్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసింది. డిజైన్‌టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది