Chandrababu Slams CM Jagan: వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పెన్సన్ కోసం వెళ్లిన వృద్ధులు చనిపోవడంపై ఏమన్నారంటే..
Chandrababu Naidu (photo/X/TDP)

Kovvur, April 4: ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పార్టీ ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద మండిపడ్డారు.

జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేరు.. బాబాయ్‌ని చంపారంటూ జగన్‌ ఓట్లు అడిగారు. రక్తంలో మునిగిన వైసీపీకు ఓట్లు వేయవద్దని అతని చెల్లి కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా? రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టుకట్టాం.  మళ్ళీ అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థ పైనే, నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్

వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. కానీ, రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు.. ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నా అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ ఇవ్వలేకపోతే టీడీపీ వచ్చాక రూ.4వేల చొప్పున పింఛను ఇస్తామన్నాం. భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారు. మీ (వైసీపీ) పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి.. కానీ, రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది. ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. మిగిలిన ఐదుస్థానాల్లో ఒక సీటు బీజేపీకి ఇచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ దుర్మార్గుడికి ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడు, కావలి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌, జే బ్రాండ్‌ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. నేను టిడ్కో ఇళ్లు ఇస్తే.. ప్రజల్ని జగన్‌ ఇబ్బందులకు గురి చేశాడు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా’’అని చంద్రబాబు చెప్పారు.

పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనపర్తి సీటు బీజేపీకు కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన అన్నారు.కాగా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది.బీజేపీతో పొత్తు కుదిరాక ఆ స్థానంలో శివకృష్ణంరాజును అభ్యర్థిగా నిలబెట్టింది.

సూపర్-6 పథకాలను మరోసారి వివరించిన చంద్రబాబు

కొవ్వూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్-6 పథకాలను వివరించారు. సూపర్-6లో మొదటిది ఆడబిడ్డ నిధి అని వెల్లడించారు. నెలకు రూ.1500 ఇస్తామని, ఇద్దరు మహిళలు ఇంట్లో ఉంటే రూ.3 వేలు, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6,000 ఇస్తామని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం అని మహిళలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ డబ్బుతో మరింత డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తానని తెలిపారు.

రెండోది... తల్లికి వందనం. ఈ బిడ్డలే మన ఆస్తి అని పేర్కొన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం అని వెల్లడించారు. ఎందుకంటే, జనాభా తగ్గిపోతోందని, జనాభా తగ్గిపోతే రాజ్యం ఉండదని అన్నారు. ఈ పిల్లలను బాగా చదివిస్తే వీళ్లు ప్రపంచాన్ని శాసిస్తారని, అందుకే తల్లికి వందనం పథకం రూపొందించామని చంద్రబాబు చెప్పారు. మూడోది... మేం అధికారంలోకి రాగానే మా ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని వెల్లడించారు.

నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, చంద్రన్నే మీ డ్రైవర్ అని, నా డ్రైవింగ్ చాలా సేఫ్ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా అడ్డొస్తే చెప్పండి... ఎవరూ మిమ్మల్ని అడగడానికి వీల్లేదు... మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అనడానికి కూడా లేదు అని స్పష్టం చేశారు.

ఇక ఐదోది... యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. వర్క్ ఫ్రం హోమ్ విధానం తీసుకువస్తాం... ప్రపంచస్థాయి కంపెనీలను అందుకు అంగీకరింపజేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆరో పథకం... రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం... రైతులకు సబ్సీడీలు ఇస్తాం, పంట బీమా అందిస్తాం, పంటను కొంటాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.