YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్‌ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం అని సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమితో తలపడతున్నాం.

జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి’’ అని సీఎం జగన్‌ గుర్తు చేశారు.  ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి

ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం. 75 శాతం నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. పెన్షన్లను మూడు వేల రూపాయాలకు పెంచుకుంటూ వచ్చాం. ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించాం. అలాంటిది.. తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీన్ని అడ్డుకున్నది చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. పేదల భవిష్యత్తు కొరకు.. అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నా అని సీఎం జగన్‌ మరోసారి ప్రశ్నించారు.

Here's CM Jagan Speech Videos

రెండు రోజుల్లో పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు విడిచారు.

ఇంత మంది మరణానికి కారణమైన చంద్రబాబుని హంతకుడు అందామా?

-సీఎం @ysjagan #CBNBackstabbedPensioners#TDPAgainistVolunteers#TDPAntiPoor#EndOfTDP pic.twitter.com/avyUS6VvHL

రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?.వలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు

అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్‌ కదా. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?.. (లేదు అనే మాట వినిపించింది). పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అని సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్‌. మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం.

Here's Cm Jagan Full Speech 

గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వాళ్ల(చంద్రబాబు అండ్‌ కో) మాదిరి పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఓటేయమని అడిగేందుకు మీ ముందుకు రాగలిగాను. కాబట్టే.. మీ జగన్‌ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనషుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ఆశీస్సులు కోరుతున్నాడు. రాబోయే ఎన్నికల కోసం కూడా అబద్ధాలు చెప్పడు. సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. పేదలపై ఈ జగన్‌కు ఉన్న ప్రేమ.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు.. ఉండదు. మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు.. గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్‌ చెప్పారు.

మన గుర్తు తెలియనివాళ్లు.. ఎవరైనా మిగిలి ఉంటే.. గుర్తు ఫ్యాన్‌. ప్రతీ ఒక్కరికీ చెబుతున్నా.. ఫ్యాన్‌ మీద వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవాళ్టి మీ బతుకులంటే ఇంకా మంచిగా చేస్తాను అని మాటిస్తున్నా. మీ బిడ్డకు తోడుగా ఉండడండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.. అని నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రసంగం ముగించారు సీఎం జగన్‌.