Smartphones Looted in Guntur: రూ.70 లక్షల విలువైన రెడ్‌మీ ఫోన్ల దొంగతనం, గుంటూరు-కోల్‌కత హైవే భారీ చోరీ చేసిన దుండుగులు, మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్
శ్రీసిటీ నుంచి కోల్‌కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు ( Smartphones looted) అపహరించారు. గుంటూరు-కోల్‌కత హైవే (ఎన్‌హెచ్-16)పై బుధవారం ఈ భారీ చోరీ (Smartphones Looted in Guntur) జరిగింది. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Guntur, Sep 16: ఏపీలో మరోసారి భారీ స్థాయిలో మొబైల్ ఫోన్ల దొంగతనం జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు ( Smartphones looted) అపహరించారు. గుంటూరు-కోల్‌కత హైవే (ఎన్‌హెచ్-16)పై బుధవారం ఈ భారీ చోరీ (Smartphones Looted in Guntur) జరిగింది. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
గతంలో తమిళనాడులోని శ్రీపెరంబూర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో గత ఆగస్టు 26న దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కంటైనర్ ఆంధ్రా బార్డర్ నగరి వద్దకు రాగానే లారీని అడ్డం పెట్టిన దుండగులు.. డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొబైల్ లోడ్ కంటైనర్ శ్రీ పెరంబూర్ నుండి ముంబైకి బయలు దేరుతుండగా కంటైనర్ ఆంధ్రా బార్డర్ నగిరి వద్దకు రాగానే దానికి దుండగులు లారీని అడ్డం పెట్టారు. అనంతరం డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు.
ఆ తర్వాత లారీ పుత్తూరు చేరుకోగానే మొబైల్స్‌ను వేరే లారీలోకి మార్చుకుని దొంగతనానికి ఉపయోగించిన లారీనీ అక్కడే వదిలేశారు. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్‌లో దాదాపు 12 కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్స్ ఉన్నట్లు సమాచారం. అందులో 16 బాక్స్‌లు ఉండగా 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. కంటైనర్‌లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి. బాధితుడు నగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తుపాకీ గురిపెట్టి తనను కొట్టి దుండగులు లూటీకి పాల్పడినట్టు బాధితుడు ఇక్బాల్ వెల్లడించాడు.