Two Cops Dies of Heart Attack: ఏపీలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మృతి, విశాఖపట్నం, ఆత్మకూరులలో అలుముకున్న విషాద ఛాయలు
ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గుండెపోటుతో (Two Cops Dies of Heart Attack) మృతి చెందారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లా ఆత్మకూరులలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి
Visakha, Mar 21: ఏపీలో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గుండెపోటుతో (Two Cops Dies of Heart Attack) మృతి చెందారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లా ఆత్మకూరులలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లి నాగేశ్వరరావు (48) సోమవారం మధ్యాహ్నం గుండె పోటుతో మృతి చెందారు.ఆరు నెలల క్రితమే అమరావతి నుంచి బదిలీపై వచ్చి ఆత్మకూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో భాగంగా సోమవారం మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయమై వెళ్లి విచారణ చేసి వచ్చారు.
మియాపూర్‌లో విషాదం, ఉదయాన్నే బ్రష్ చేస్తుండగా మూర్ఛ రావడంతో సంపులో పడి యువతి మృతి
మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన అనంతరం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు.బాపట్ల జిల్లా చీరాలకు (పూర్వపు ప్రకాశం జిల్లా) చెందిన నాగేశ్వరరావు 2009లో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్‌ఐగా బదిలీపై వచ్చారు. తరువాత తడ, నెల్లూరులోని సంతపేట పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డితోపాటు పలువురు ఎస్‌ఐలు, పోలీసులు, ప్రముఖులు ఆస్పత్రిలో మల్లి నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
డ్యాన్స్ చేస్తుండగానే సడెన్‌గా గుండెపోటు.. తర్వాత ఏమైంది? భోపాల్ లో ఘటన.. వీడియోతో
ఇక మరో ఘటనలో విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటశ్రీరామ్‌శర్మ(55) ఆదివారం ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఉద్యోగరీత్యా విశాఖలో కుటుంబంతో నివాసముంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.