Telangana: మియాపూర్‌లో విషాదం, ఉదయాన్నే బ్రష్ చేస్తుండగా మూర్ఛ రావడంతో సంపులో పడి యువతి మృతి
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఉదయం బ్రష్ చేస్తుండగా మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందింది.మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాంధీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది.
Hyd, Mar 21: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఉదయం బ్రష్ చేస్తుండగా మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందింది.మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాంధీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది.
డ్యాన్స్ చేస్తుండగానే సడెన్‌గా గుండెపోటు.. తర్వాత ఏమైంది? భోపాల్ లో ఘటన.. వీడియోతో
నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది.ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 21, 2023 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

