Swachh Survekshan 2020: స్వచ్ఛ సర్వేక్షణ్ -2020, ఏపీలో సత్తా చాటిన మూడు నగరాలు, టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupati) నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు.
Amaravati, August 20: భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను (Swachh Survekshan awards 2020) గురువారం ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupati) నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు.
10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల జాబితాలో నాలుగవ స్థానంలో విజయవాడ, ఆరవ స్థానంలో తిరుపతి, తొమ్మిదవ స్థానంలో విశాఖపట్నంలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు సంపాధించడం ఆనందదాయకమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.
మొత్తం లిస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు. దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2016 సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.
జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్‌గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు.
దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి
గ్రేటర్ హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. గతేడాది హైదరాబాద్ నగరం 35వ స్థానంలో ఉండే. ఇప్పుడు ముంబై, బెంగళూరు నగరాలను దాటి హైదరాబాద్ మెరుగైన స్థానాన్ని సంపాదించింది.