MLC Election Result: తగ్గని వైఎస్ జగన్ మేనియా, 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, తెలంగాణలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (MLC Election Result) విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Amaravati, Mar 17: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (MLC Election Result) విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెలంగాణలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ -రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.తాజాగా వీటి ఫలితాలు విడుదలయ్యాయి.
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ (YSRCP Clean Sweep in Andhra Pradesh) చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి నర్తు రామారావు, కర్నూలు జిల్లా నుంచి మధుసూదన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ ఘనవిజయం సాధించారు. ఈ నాలుగు స్థానాల్లోనూ సంఖ్యా బలం లేకపోయినా స్వతంత్రుల ముసుగులో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. కాగా, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇక తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి (AVN Reddy win in Telangana with BJP Support) సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు.దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు.
ఇక ఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు( BRS Candidates ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్( Despathi Srinivas ), నవీన్ కుమార్( Naveen Kumar ), చల్లా వెంకట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)