Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు, ఉపరితల ద్రోణికి నైరుతి రుతుపవనాలు తోడు, రానున్న రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం
దీనికి నైరుతి రుతుపవనాల ప్రభావం (Southwest Monsoon) కూడా తోడయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Rains In Telugu States) కుండపోతగా వానలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States RainFall) గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Amaravati, July 24: చత్తీస్‌ఘఢ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి నైరుతి రుతుపవనాల ప్రభావం (Southwest Monsoon) కూడా తోడయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Rains In Telugu States) కుండపోతగా వానలు కురుస్తున్నాయి. గురువారం కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తా జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States RainFall) గురువారం పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరోగ్య ఆసరా కింద మహిళలకు రూ.5 వేల నగదు, ఉచిత చికిత్సకు ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి, రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం, ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే రాయలసీమలో ఈరోజు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏపీలో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, కొవ్వూరుల్లో భారీ వర్షాలు కురిశాయి. రాజమండ్రిలో 90.5, బాపట్ల 75.5, పోడూరు 70.25, తాడేపల్లిగూడెం 66.5, ఉయ్యూరు 66 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. 24న కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 25న కర్నూలు జిల్లాలో అతిభారీ వర్షం, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 26,27 తేదీల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరుగా, దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై నడుము లోతున వరదనీరు పోటెత్తింది. నగరంలో సరాసరిన 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు రావాలి, ఇతర దేశాల్లోని సాగు పద్ధతులను అధ్యయనం చేయాలి, అవసరం మేరకు ఏఈఓల నియామకాలు చేపట్టాలి; వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాండూరు పట్టణంలోని తాండూరు–హైదరాబాద్ రోడ్డు మార్గం చెరువును తలపించింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో 7 సెంటీమీటర్లు, కోరుట్ల మండలం అల్లాపూర్, మెట్‌పల్లిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శుక్రవారం కూడా ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరో 72 గంటలపాటు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.