Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త
సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద సూసైడ్ కథనాలు (Geethanjali Suicide Case) ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ (trolled in Social Media) వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు..
Tenali, Mar 12: తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద సూసైడ్ కథనాలు (Geethanjali Suicide Case) ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ (trolled in Social Media) వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
వైసీపీ నేతలు ఆమెకు సంఘీబావం ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఇవాళ ఆమె (Tenali Woman Gotti Geetanjali Devi) నివాసానికి వైసీపీ నేతలంతా వెళ్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్‌తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక MLAతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
అసలేం జరిగింది: గీతాంజలి అసలు పేరు గొట్టి గీతాంజలి దేవి. తెనాలిలో నివాసం ఉంటుంది. ఆమె వయసు 29 ఏళ్లు. ఈమె భర్త బాలచంద్ర. బంగారం పని చేస్తుంటాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గీతాంజలి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. ఇటీవల వైసీపీ సభలో ఆమె ఇంటిస్థలం పట్టాకు కూడా అందజేశారు. దీంతో తన కల నెరవేరుతోందంటూ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Here's Her Husband Statement
Minister Roja Statement
Here's YSRCP Tweet
ఆ పట్టాను అందుకున్న గీతాంజలి తన ఆనందాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంది. సొంత ఇల్లు తన కల అని.. ఆ కల ఈనాటికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అలానే తన పిల్లలకు అమ్మ ఒడి అందుతుందని.. ఆ డబ్బులను పిల్లల పేరు పై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నాని పేర్కొన్నారు.ఇక తమ మామయ్యకు పింఛన్ వస్తోంది. అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్న గెలవడం ఖాయం" అంటూ గీతాంజలి తన సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడిన మాటలు కొద్దీ గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
BC Commission Serious on Issue
Here's Tanali MLA Statement
Here's What her Statement on dies before
ఈ క్రమంలో కొంతమంది ఆమెపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు దిగారు. రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. సోషల్ మీడియా వేధింపులు భరించలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం గీతాంజలి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ చెబుతున్నారు.
తెనాలిలో గీతాంజలి మృతిపై BC కమిషన్ సీరియస్ అయింది.. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు మారేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే, స్థానిక పోలీసులతో మాట్లాడిన మారేష్ కుమార్.. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆత్మహత్య ఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గీతాంజలికి నివాళులు అర్పించారు. .
ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏంటి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఆమె ట్రోలింగ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా..? లేక వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారా..? అసలు ఆమెది ఆత్మహత్యేనా..? అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి.గీతాంజలి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.