Union Minister Gajendra Singh Shekawat and Jana Sena chief Pawan Kalyan met at Chandrababu's residence on seat adjustment Watch Video

Vjy, Mar 12: వచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కు­వ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లను తగ్గించారు.  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సోమవారం టీడీపీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, మాజీ ఎంపీ వైజయంత్‌ పాండా సుమారు 8 గంటలు చర్చలు (BJP-TDP-Jana Sena Alliance Meeting) జరిపారు. అనంతరం... ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నదీ వివరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  ఎవరికి ఎన్ని సీట్లు ? నేటితో తేలిపోనున్న పొత్తుల లెక్కలు, చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ

ఈ ప్రకటన ప్రకారం.. తెలుగుదేశం (TDP) పార్టీ 17 పార్లమెంటు, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన (Janasena) రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది.బీజేపీ ఆరు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీ (BJP), జనసేనకు కలిపి 8 పార్లమెంటు, 30 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు... అసెంబ్లీ స్థానాల సంఖ్య 31కి పెరిగింది. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లు ఇచ్చారు. బీజేపీతో పొత్తు అనంతరం జనసేన ఒక ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. టీడీపీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది.

Here's Statement

తొలుత బీజేపీ పెద్దలు తమకు, జనసేనకు కలిపి 45 ఎమ్మెల్యే, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన చంద్రబాబు ఎట్టకేలకు వారిని 10 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లకు ఒప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని జనసేన అధ్యక్షుడు సోమ­వారం తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్ల పంపకం జరిగిందన్నారు. సీట్ల సంఖ్యలో హెచ్చు­తగ్గు­లకంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని స్పష్టం చేశారు.