3rd Phase Free Ration Distribution: 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి
ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేసిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకుల పంపిణీని (3rd Phase Free Ration Distribution) ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.
Amaravati, April 29: దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో (Lockdown) పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేసిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకుల పంపిణీని (3rd Phase Free Ration Distribution) ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నారు. 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ఏపీలో 1,259కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు, తాజాగా 82 కరోనా కేసుల నమోదు
బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తున్నారు. కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. భౌతిక దూరంను పాటిస్తూ రేషన్ తీసుకునేందుకు టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు.కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు ద్వారా రేషన్ పంపిణీ, రేషన్ దుకాణాల వద్ద మాస్క్‌ల పంపిణీ జరుగుతోంది. అధికారులు రేషన్ దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.