Andhra pradesh Coronavirus: 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ఏపీలో 1,259కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు, తాజాగా 82 కరోనా కేసుల నమోదు
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, April 28: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh COVID-19) కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో ఏపీలో (Andhra pradesh) కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు, కలిసికట్టుగా కరోనాని తరిమేద్దాం, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది, ప్రెస్ మీట్లో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి

ప్రస్తుతం రాష్ట్రంలో 970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో..అనంతపురం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 17, వైఎస్సార్‌ జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

నరసరావు పేటలో 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుకు కలెక్టర్ శామ్యూల్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాలన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడిచిని 24 గంటల్లో కొత్తగా మరో 17కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 254కు చేరింది. 8 మంది మృతి చెందారు.

Here's AP Corona Report

రాష్ట్రంలో సోమవారం నాటికి రాష్ట్రంలో 74,551 టెస్టులు చేశారు. దీంతో జాతీయ స్థాయి గణాంకాల ప్రకారం ఏపీలో పది లక్షల జనాభాకు సగటున 1396 మందికి టెస్టులు జరుగుతున్నాయి. వెయ్యి టెస్టుల మార్కు దాటుకున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, తమిళనాడు చేరాయి. మిగతా రాష్ట్రాలన్నీ పది లక్షల జనాభాకు సగటున 900లోపే టెస్టులు చేస్తున్నాయి.

ఇక.. జాతీయ స్థాయిలో సోమవారం నాటికి పది లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 480గా నమోదైంది. దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి 6,65,819 టెస్టులు చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,177 పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 74,551 మందికి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, నేడే జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇన్ఫెక్షన్‌ రేటు నియంత్రణ, పాజిటివ్‌ కేసుల తగ్గుదల శాతంలోనూ ముందడుగు వేసింది. తాజాగా రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చూస్తే రోజురోజుకు ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.