Amaravati, April 27: కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఏపీ సీఎం (AP CM YS Jagan Press Conference) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్‌కు (AP Lockdown) సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే అత్యధిక కరోనావైరస్ (Coronavirus) టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈనెల రోజుల్లో టెస్టింగ్ సౌకర్యాలను పెంచుకున్నామని, కరోనా వైద్య పరీక్షల కోసం రాష్ట్రంలో 9 వీఆర్‌డీఎల్, 44 ట్రూనాట్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్
ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని వెల్లడించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్ జోన్‌లో 54, గ్రీన్ జోన్‌లో 559 మండలాలున్నాయని, 5 కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా... కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి ఉందని సీఎం జగన్ అన్నారు.
Here's YSR Congress Party Tweet
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్. కరోనా నివారణలో భాగంగా ఈ నెల రోజుల్లో టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోగలిగామని తెలిపిన సీఎం. కోవిడ్ టెస్టుల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి #APFightsCorona pic.twitter.com/LOpDdwCoiD
— YSR Congress Party (@YSRCParty) April 27, 2020
రాష్ట్రంలో ఐదు చోట్ల కోవిడ్ 19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామని... విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో వీటిని ఏర్పాటు చేశామని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని బాగా చూసుకుంటున్నామని... ప్రతి ఆస్పత్రిలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..
కరోనా వస్తే చనిపోతామని, ఇదేదో భయంకరమైన రోగమనే అపోహలు వద్దని, ఇది కూడా స్వైన్ ఫ్లూ తరహాలో మారిపోతుందని అన్నారు. ఇవన్నీ కూడా నయమయ్యే వ్యాధులే అని ఏపీ సీఎం అన్నారు. అయితే దీని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కొందరికి ఈ వ్యాధి కూడా వచ్చినట్టు తెలియదని... ఇటీవల అధ్యయనాల్లో ఇది తేలిందని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. హాట్ జోన్‌లో 70 శాతం టెస్టు చేస్తే పాజిటివ్ రేటు 1.61శాతంగా ఉందని తెలిపారు. దేశంలో ఇది 4 శాతం ఉందని సీఎం జగన్ అన్నారు.ఏప్రిల్ నెల వేతనాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కొన్ని శాఖల వారికి పుల్ జీతం, పెన్సనర్లకు 100 శాతం పేమెంట్, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
రోగ నిరోధకశక్తి పెంచుకునేలా ఆహారపు అలవాట్లు ఉండాలి. రెడ్, ఆరెంజ్ జోన్లలో చేసిన 70శాతం పరీక్షల్లో...1.61 శాతం మాత్రమే పాజిటివ్ కేసులొచ్చాయి. భౌతికదూరం కచ్చితంగా పాటించాలి. మనిషికి, మనిషికి మధ్య ఒక మీటర్ దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి ఇంటికి మాస్కులు అందిస్తున్నాం. ప్రతి మనిషికి మూడు మాస్కులు ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 40 వేల బెడ్స్‌లో 25 వేలు సింగిల్ ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలో మాస్కులు, ప్రొటెక్షన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడవద్దు, వెంటనే చైనాకు వాటిని తిరిగి పంపండి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్
కోవిడ్ ఆస్పత్రుల్లో అదనంగా డాక్టర్లు, నర్సులు, టెక్నీషీయన్లను భర్తీ చేశాం. 14410 టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం. ఆర్థికలోటు ఉన్నా.. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. నెలరోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే ఏర్పాట్లు చేశాం. ప్రతి పేద కుటుంబానికి రూ.వెయ్యి సాయం అందించాం. 56 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ అందించామని తెలిపారు.
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కి చేరింది.గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కర్నూలు లో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 235 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు. జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237, కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదువిశాఖపట్నం 22 , అనంతపురం 53, చిత్తూరు 73, నెల్లూరు 79 కడప 58, ప్రకాశం 56, తూర్పుగోదావరి 39, పశ్చిమగోదావరి 54, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు