Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravati, April 27: ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై (AP Government Employees Salaries) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతం చెల్లించనుంది. వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్

ఈ మేరకు ఆదివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ నెల పూర్తి పెన్షన్‌ అందించాలని ప్రభుత్వం (AP government) నిర్ణయించింది. గత నెలతో వీరికి 50శాతం పెన్షన్‌ మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మరోపక్క వైరస్‌ నియంత్రణతోపాటు ఇతర అత్యవసరాలకు నిధుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీఎంతో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఏప్రిల్‌ నెల వేతనాలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి వేతనాలు కూడా వారికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

పెన్షనర్లను దృష్టిలో ఉంచుకుని వారికి ఏప్రిల్‌ నెలలో పూర్తి పెన్షన్‌ చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్‌లో పూర్తి స్థాయిలో పెన్షన్‌ చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చిలో పెన్షనర్లకు 50 శాతమే చెల్లించిన విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే మార్చి మాదిరిగానే ఏప్రిల్‌ వేతనాలను చెల్లిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులందరికీ (నాలుగో తరగతి సిబ్బంది మినహా) మార్చి నెల తరహాలోనే ఏప్రిల్‌ వేతనాల్లో కూడా 50 శాతం చెల్లించి మిగతా 50 శాతం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10% వాయిదా వేసి మిగతా 90 శాతం వేతనాలను చెల్లించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది. అఖిల భారత సర్వీసు విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులందరికీ మార్చి తరహాలోనే ఏప్రిల్‌లో కూడా వేతనాల్లో 40% చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.