Train Accident In Nellore: నెల్లూరులో అర్ధరాత్రి రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం.. పట్టాలపై ఉన్న మహిళను రక్షించే ప్రయత్నంలో పురుషులు మరణించారంటున్న ప్రత్యక్ష సాక్షులు

గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు.

Credits: Google (Representational Image)

Nellore, Jan 22: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో గత అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గూడూరు (Gudur) నుంచి  విజయవాడ (Vijayawada) వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ ప్రెస్ (Narsapur Express) రైలు ఢీకొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందారు. నగరంలోని ఆత్మకూరు (Atmakuru) బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. వారి వయసు 45 నుంచి 50 ఏళ్లు మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జి పై నుంచి కిందపడి చనిపోయింది.

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు, ఇండ్లు కట్టుకునేవారికి ఆర్ధికసాయంపై మధ్యతరగతి ఆశలు

పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదం బారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేదంటే, ఇంకెవరైనానా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష