Palnadu Crime: కూతుర్ని వేధిస్తున్నందుకు అల్లుడితో పాటూ కుటుంబం మొత్తాన్నినరికి చంపిన బంధువులు, పల్నాడులో కలకలం రేపిన మూడు హత్యలు, స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య గావించబడ్డారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన అనంత సాంబశివరావు(50), అది లక్ష్మి(47), నరేష్(30)లను సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా నరికి (Killed) చంపారు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Vijayawada, NOV 23: పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య గావించబడ్డారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన అనంత సాంబశివరావు(50), అది లక్ష్మి(47), నరేష్(30)లను సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా నరికి (Killed) చంపారు. కొన్నాళ్లుగా భార్యను భర్త, అత్త, మామ వేధిస్తున్నట్లు సమాచారం.

Food Poison in Mid-day Meal: బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్ధులు, 51 మందికి అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, అన్నమయ్య జిల్లాలో ఘటన 

హత్య అనంతరం భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.