TikTok Addiction: విజయవాడలో విషాదం, టిక్‌టాక్ వద్దన్నందుకు భార్య ఆత్మహత్య, తల్లి లేని చోట ఉండలేనంటూ కొడుకు ఆత్మహత్య
సోషల్ మీడియా టిక్ టాక్ వ్యసనం (TikTok Addiction) ఇద్దరి ప్రాణాలను తీసింది. విజయవాడలోని (Vijayawada) జక్కంపూడి జేఎన్ యూఆర్ఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య అదే పనిగా టిక్ టాక్ వీడియోలు (TikTok Videos) చేస్తుండడం పట్ల విసుగుచెందాడు. టిక్ టాక్ వీడియోలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ, భర్త మందలింపును తీవ్రంగా పరిగణించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
Amaravati, May 20: విజయవాడలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా టిక్ టాక్ వ్యసనం (TikTok Addiction) ఇద్దరి ప్రాణాలను తీసింది. విజయవాడలోని (Vijayawada) జక్కంపూడి జేఎన్ యూఆర్ఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య అదే పనిగా టిక్ టాక్ వీడియోలు (TikTok Videos) చేస్తుండడం పట్ల విసుగుచెందాడు. టిక్ టాక్ వీడియోలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ, భర్త మందలింపును తీవ్రంగా పరిగణించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగబాబు గాడ్సే ట్వీట్ దుమారం, నన్ను అర్థం చేసుకోవాలంటూ మరో ట్వీట్, మహాత్మా గాంధీ గురించి ట్విట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన నటి విజయశాంతి
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే, తల్లి ఆత్మహత్యకు పాల్పడడాన్ని కుమారుడు భరించలేకపోయాడు. క్రిమి సంహారక మందు తాగి తాను కూడా బలవన్మరణం చెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరు, అది కూడా ఒక్క రోజు తేడాతో చనిపోవడంతో ఆ కుటుంబంలోనే కాదు, కాలనీలో సైతం విషాద వాతావరణం నెలకొంది.కాగా మరణించిన మహిళ వయస్సు 35 సంవత్సరాలు, ఆమె కుమారుడు మైనర్.
భర్త గోల్డ్ పాలిషర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కరోనావైరస్ మహమ్మారి మధ్య ఉద్యోగం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ మధ్య జరిగిన ప్రమాదానికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వారు వైద్య బిల్లులు చెల్లించడానికి రుణం తీసుకున్నారు మరియు వారి పెద్ద కుమార్తె కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ట్విస్టులతో సాగుతున్న డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్, సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలన్న హైకోర్టు, కేసును వెనక్కి తీసుకోవాలన్న ఐఎంఎ, ఆది నుంచి ఏం జరిగింది..?
ఈ నేపథ్యంలో బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ బంద్ చేయాలని భర్త భార్యను కోరడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పండింది. ఇదిలా ఉంటే వీడియో షేరింగ్ యాప్‌ను నిషేధించాలని రేఖా శర్మ భారత ప్రభుత్వాన్ని కోరారు, ఇది ఉత్పాదకత లేని జీవితం వైపు యువకులను నెట్టివేస్తోందని చెప్పారు.