Doctor Sudhakar Case: ట్విస్టులతో సాగుతున్న డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్, సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలన్న హైకోర్టు, కేసును వెనక్కి తీసుకోవాలన్న ఐఎంఎ, ఆది నుంచి ఏం జరిగింది..?
AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, May 20: డాక్టర్ సుధాకర్ అరెస్ట్ (Doctor Sudhakar Arrest)ఘటనపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. సస్పెండ్ అయిన వైద్యుడు సుధాకర్ ( Dr Sudhakar Rao) తాగి రోడ్డు మీద హల్ చల్ చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రభుత్వం, పోలీస్ అధికారులపై ఆయన అసభ్య పదజాలం వాడటంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్థ నగ్నంగా ఆయనను అరెస్ట్ చేశారని హైకోర్టులో ప్రజా ప్రయోన వ్యాజ్యం దాఖలు అయింది. టీడీపీ నేత వంగలపూడి అనిత ఈ పిటిషన్ ధాఖలు చేశారు. నా బలం మీరే,మీపైనే పూర్తి నమ్మకం, రాబోయే రోజుల్లో కరోనా భారీన పడని వారు ఉండరేమో.., అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ సీఎం సమీక్ష, ఏపీలో తాజాగా 68 కేసులు నమోదు

ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాగ్మూలాన్ని హైకోర్టులో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌తో పాటు వీడియో క్లిపింగ్స్‌ను కూడా పిటిషనర్ తరుపు న్యాయవాదికి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Here's Dr Sudhakar’s behaviour Video

కాగా ఆస్పత్రిలో మాస్కులు లేవని మచిలీపట్నం దగ్గర నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు సుధాకర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. అయితే అంతకు ముందు రోజు డాక్టర్ సుధాకర్ ఓ టీడీపీ నేతను కలిశారని, టీడీపీ వాళ్ల డైరెక్షన్‌లోనే ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన్నిఏపీ ప్రభుత్వం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Here's Dr. Sudhakar Rao Video

అనంతరం మే 16న విశాఖలో ప్రత్యక్షమైన డాక్టర్ సుధాకర్ నడిరోడ్డుపై రచ్చ చేశారు. శరీరం మీద చొక్కా లేకుండా ధర్నాకు దిగారు. రోడ్డు మీద వెళ్లే వారితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు వెళ్లారు. ఆయన్ను చేతులు వెనక్కు కట్టేసి.. విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐతే డాక్టర్ సుధాకర్‌కి ఎక్యూట్ అండ్ ట్రాన్సియంట్ సైకోసిస్ అనే మానసిక సమస్య ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఇంటికి డాక్టర్ సుధాకర్ వెళ్లిన దృశ్యాలు

ఈ సంఘటనపై తాజాగా సీఎం జగన్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (Indian Medical Association (IMA) లేఖ రాసింది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని ఐఎంఏ తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపింది. ఆస్పత్రిలో డాక్టర్ల భద్రతపై మాట్లాడినందుకు ఆయన పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించింది.

Heres Video

విశాఖలో సుధాకర్ ప్రవర్తించిన తీరును బాగాలేనప్పటికీ.. ఓ ప్రభుత్వ వైద్యుడి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడింది. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌తో పాటు విశాఖలో జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని తెలిపింది. ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.

Here's  Video 

విశాఖలో (Visakhapatnam) డాక్టర్ సుధాకర్ ప్రవర్తించిన తీరును బాగాలేనప్పటికీ.. ఓ ప్రభుత్వ వైద్యుడి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడింది. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌తో పాటు విశాఖలో జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ చేయాలని.. ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

డాక్టర్ సుధాకర్ రావును అరెస్టు చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క తాత్కాలిక నివేదికను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సమర్పించింది. అతని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతనిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఎ డిమాండ్ చేసింది. అలాగే డాక్టర్ సుధాకర్ తన మానసిక ఆరోగ్యం యొక్క ధ్వని స్థితిని ధృవీకరించిన తరువాత జగన్ మరియు ఇతరులకు డాక్టర్ క్షమాపణ చెప్పాలని ఐఎంఎ తెలిపింది.

పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా స్టేట్మెంట్

గతంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ శనివారం తప్పతాగి అసభ్యంగా మాట్లాడుతూ అందర్ని తిట్టారని పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు. పోర్టు ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యక్తి కారుపై వచ్చి తప్పతాగి గొడవ చేస్తున్నాడంటూ 100కి కాల్ వచ్చిందని, గొడవ చేస్తున్న ఆయనను నియంత్రించడానికి స్ధానికులే తాళ్లు కట్టారని చెప్పారు. ఆ సమయంలో అతను సుధాకర్ అని కానిస్టేబుళ్లకి తెలియదు. తాగి గొడవ చేస్తుండటంతో పాటు లారీ క్రిందకి వెళ్లాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతనిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడినుంచి అతనిని కేజీహెచ్‌కి తరలించారు. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశాం. అతని ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యులకి చెప్పే మానసిక చికిత్సాలయానికి తరలించాం. అతను తాగిన మైకంలో లారీ క్రింద పడబోతే రక్షించామని అన్నారు.

ఎమ్మెల్యే ఉమాశంకర్

దళితుడైన అనస్థీషియా డాక్టర్‌ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. సుధాకర్ మాటలపై అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయ్యన్న పాత్రుడు గురించి డాక్టర్ సుధాకర్ మాట్లాడిన వీడియోను ఆయన వెలుగులోకి తెచ్చారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ బాబు టీడీపీకి చెందిన వ్యక్తి అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. గతంలో సుధాకర్‌ బాబు టీడీపీ సీటును ఆశించిన వ్యక్తి అని అన్నారు.

ఎమ్మెల్యే మేరుగు నాగార్జున

డాక్టర్‌ సుధాకర్‌.. చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు డైరెక‌్షన్‌లో నడుస్తున్నాడని, రెండు ఎల్లో మీడియా సంస్థలు ఈ ఘటనను డ్రామాగా చూపిస్తున్నాయని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున విరుచుకుపడ్డారు. డాక్టర్‌ సుధాకర్‌ ఘటనలో రాజకీయ కుట్ర దాగి ఆయన మండిపడ్డారు. దీనిపై విశాఖ కమీషనర్, డీజీపీ తక్షణమే విచారణ చేపట్టాలన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు

కోవిడ్ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగినందుకు అవమానకరంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. సుధాకర్ పై వేధింపుల్లో భాగంగానే తాళ్లతో కట్టేసి మరీ అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు అనాగరికమని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. డాక్టర్ అయిన సుధాకర్ ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. వారం రోజుల నుంచి సుధాకర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.