Amaravati, Mat 20: కోవిడ్ 19 (COVID-19) నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు (AP Corona Update) నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ (Medical and Health Department)వివరాలను వెల్లడించింది. 9,159 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. యూకే నుంచి విజయవాడకు చేరుకున్న 143మంది ప్రవాసాంధ్రులు, విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు, వందే భారత్ మిషన్ 2లో భాగంగా ఏపీకి రానున్న 13 విమానాలు
కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2,407కు చేరుకుంది. ఇందులో 1,639 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 53 మంది మరణించారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,58,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 2,407 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.
AP Corona Update
#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,159 సాంపిల్స్ ని పరీక్షించగా 68* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒక్కరు మరణించారు#APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) May 20, 2020
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసు లకు గాను 1639 మంది డిశ్చార్జ్ కాగా, 53 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715. #APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) May 20, 2020
చెన్నై కోయంబేడు మార్కెట్ లింక్‌లు ఎక్కువగా ఉండడంతో నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. అందులో 17 సూళ్లూరుపేట పట్టణానికి చెందినవి కావడం గమనార్హం. తాజా వాటితో కలిపి కేసుల సంఖ్య 183కి చేరింది.
మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్ –19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
Here's AP CMO Tweet
దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నియంత్రణతోపాటు పలు కీలక అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కీలక సందర్భంలో వారు చేసిన సేవల్ని ప్రశంసించారు. 2021 జూన్ వరకు అభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించారు. pic.twitter.com/yu8OyAdn2d
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 19, 2020
``నేను ప్రతిసారీ చెబుతున్నా నా బలం మీరే, మీపై పూర్తి నమ్మకం పెట్టాను. మీరు ఇంకా బాగా పనిచేస్తేనే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు. 2021 జూన్ వరకు రూపొందించిన మార్గదర్శకాలు అమలయ్యేలా చూడండి.``అంటూ కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశం. (2/2)
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 19, 2020
నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మనం కోవిడ్–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్ –19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్ రానివారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలని అన్నారు.