Nagababu Controversy Tweet: నాగబాబు గాడ్సే ట్వీట్ దుమారం, నన్ను అర్థం చేసుకోవాలంటూ మరో ట్వీట్, మహాత్మా గాంధీ గురించి ట్విట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన నటి విజయశాంతి
Jabardasth Show: nagababu-responds-on-his-youtube-channel-on-why-he-quit-jabardast (Photo-Youtube)

Hyderabad, May 20: నాథూరాం గాడ్సే (Nathuram Godse) అసలు సిసలైన దేశభక్తుడంటూ సీనియర్ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు (Nagababu Controversy Tweet) పెను దుమారాన్ని రేపాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు అంశాలపై మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత వివాదాస్పద అంశం నాధురాం గాడ్స్ దేశభక్తిపై నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. పాత హీరోయిన్లతో కొత్తగా స్టెప్పులేసిన చిరంజీవి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ లేటెస్ట్ డ్యాన్స్

ఈ కామెంట్లపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీ అన్నాతమ్ముళ్లు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ పరువు ఎందుకు తీస్తున్నావంటూ మెగా అభిమానులు నాగబాబుపై మండిపడ్డారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నాగబాబు మీద ఆవేశం వెళ్లగక్కారు. దీనిపై నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అందరూ తనను అర్థం చేసుకోవాలని, తన మాటల్లో అర్థం ఇదేనని మరో ట్వీట్ చేశారు.

Here;s Naga Babu Konidela Tweets

‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ (Mahatma gandhi) అంటే నాకు చాలా గౌరవం. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వారికన్నా ఎక్కువగా నాకు ఆయనంటే చాలా గౌరవమని’ నాగబాబు మరో ట్వీట్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

కాగా, నిన్న నాథూరాం గాడ్సే జయంతి సందర్బంగా.. ఆయన నిజమైన దేశ భక్తుడు, అయితే ఆయన ఎందుకు చంపాడు, ఆయన వైపు నుంచి ఆ సమయంలో మీడియా చూపించలేదన్నారు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని’ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు. ‘గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ ఆకాంక్షిస్తున్నా అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

Here's Vijayashanthi Tweet

నాగబాబు వివాదం కొనసాగుతుండగానే.. సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి మహాత్మా గాంధీ గురించి ట్విట్ చేశారు. కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్. ''నాకు కూడా''...''అని''గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా Folded hands అంటూ విజయశాంతి ట్వీట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు.