Tirumala Temple: శ్రీవారి ఆలయం మూసివేత, డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయం క్లోజ్, డిసెంబర్ 26న ఏర్పడనున్న సూర్యగ్రహణమే కారణం
డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 రాత్రి మధ్యాహ్నం 12గంటల వరకూ ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ(TTD) తెలిపింది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం(solar eclipse) ఏర్పడనుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
Tirumala,December 16: శ్రీవారి ఆలయం(Sri Venkateswara temple) మూసివేయనున్నారు. డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12గంటల వరకూ ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ(TTD) తెలిపింది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం(solar eclipse) ఏర్పడనుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
గ్రహణం సందర్బంగా శ్రీవారి ఆలయంతో పాటు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. డిసెంబర్ 26న జరిగే పలు ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ విషయాన్ని భక్తులంతా గమనించాలని టీటీడీ పాలక మండలి విజ్నప్తి చేసింది.
సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది.
ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదు . గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.