Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం, సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని తెలిపిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ధరల పెంపుపై కేవలం చర్చ (TTD had no plans to increase service prices) మాత్రమే జరిగిందని ఆయన ( Chairman YV Subbareddy) అన్నారు.

two-days-vaikunta-dwara-darshanam-tirumala-says-yv-subba-reddy (Photo-Twitter)

Tirumala, Mar 4: తిరుమలలో సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ధరల పెంపుపై కేవలం చర్చ (TTD had no plans to increase service prices) మాత్రమే జరిగిందని ఆయన ( Chairman YV Subbareddy) అన్నారు. రెండేళ్ల తరువాత పది రోజుల క్రితం సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం వల్ల భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు.భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని అన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని అన్నారు.

ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందజేస్తామని వివరించారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని పేర్కొన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చైర్మన్‌ తెలిపారు.

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, కొనసాగుతున్న సీఎం జగన్ పోలవరం పర్యటన

సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.