Tirupati Laddu Controversy : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ, ఇదంతా చంద్రబాబు కుట్రేనని వెల్లడి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధానిని కోరిన జగన్

తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.

Tirupati Laddu Controversy YS Jagan writes A Letter to PM Modi (X)

Vij, Sep 22: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్. తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.

టీడీపీ నేతలు, చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని... వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

రాజకీయ లబ్ధికోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ... లడ్డూ వివాదం విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో కోరారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక‌, టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు తేల్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వివాదం రాజుకుంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif