TTD: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచిన వార్తలన్నీ అబద్దం, సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు

TTD EO Dharma Reddy (Photo-TTD)

Tirumala, Jan 12: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO dharma reddy) అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు. భక్తులకు నిజాలు తెలియాలి అనే ఉద్ధేశ్యంతోనే ఈ వివరాలు ( Rumors on increase prices of rented rooms) తెలియజేస్తున్నామన్నారు.

తిరుమలలో 7500 గదులు ఉన్నాయి. వీటితో పాటు యాత్రికులు ఉచిత సముదాయాలు నాలుగు ఉన్నాయి. సామాన్య భక్తులకు సంబంధించి ఉచితంగా ఉండటానికి లాకర్లు, బోజనం, స్నానపు గదులు ఉన్నాయి. రూ.50, రూ.100 గదులు 5 వేల గదులు ఉన్నాయి. 40 సంవత్సరాలుగా అదే అద్దె ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక గదులను రూ.116 కోట్లతో ఆధునికీకరణ చేసాము.

వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలి, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 ఏర్పాట్లపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

50 రూపాయలు గది ప్రయివేట్ హోటల్ ధర రూ.2వేలుగా ఉంటుంది. గిజర్, రూమ్ క్లీనింగ్, కరెంట్ బిల్‌ అన్ని కలిపి రూ.250 ఖర్చు అవుతుంది. అయినా కూడా సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదు. 1230 గదులు 1000 రూపాయల అద్దె ఉన్న గదులు ఉన్నాయి. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్లో కేటాయిస్తాము.

ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన ధర్మాసనం

ప్రముఖులకు సంబంధించి పద్మావతి, ఎంబీసీ కార్యాలయాల్లో గదుల ఇస్తారని, నారాయణగిరి, ఎస్వీ అతిథిగృహం, స్పెషల్‌ టైప్‌ అతిథి గృహాలు ఎంబీసీ కార్యాలయం కింద ఉన్నాయన్నారు.పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో ఉన్న గదులకు అద్దె ఎక్కువగా ఉంటుంది. సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో విఐపీలు అధికంగా వస్తారు. 1,344 గదులో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దెలు పెంచాము. పద్మావతి ప్రాంతంలో ఉన్న విఐపీలకు కేటాయించే గదులను రూ.8 కోట్ల వ్యాయంతో ఆధునికీకరణ చేసాము. టిటిడి ఆదాయం కోసం గదుల ధరలు పెంచలేదు.

ఏసీ గదులుగా ఏర్పాటు చేసి అన్ని గదులకు సమానంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఇది. టిటిడి పై చేస్తున్న విమర్శలు ఖండిస్తున్నాము. విమర్శలు చేసే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. .తిరుమల వచ్చి స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఒక్కో గదికి రూ.5 లక్షలు ఖర్చు చేసాము. పెరిగిన ధరల వల్ల టిటిడికి నామమాత్రపు ఆదాయం మాత్రమే వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif