Tourist Bus Caught Fire: మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు, శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం, 18 మందికి గాయాలు, గాయపడిన వారిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలింపు, వెనుక నుంచి మరొక బస్సు బలంగా ఢీకొట్టడంతో ఘటన, ( వీడియో)
ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు మంటల్లో కాలి (Tourist Bus Catches Fire)బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి.
Srikakulam, December 05: శ్రీకాకుళం జిల్లా (Srikakulam) పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు మంటల్లో కాలి (Tourist Bus Catches Fire)బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద ఘటనతో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దేశ రాజధానిలో మరో ఘోర అగ్ని ప్రమాదం
Here's Video
ఉత్తరాఖండ్‌కి(Uttarakhand) చెందిన భక్తులు రెండు బస్సులలో 10 రోజుల క్రితం సౌత్ ఇండియా టూర్‌కు బయలుదేరారు. వీరంతా శనివారం ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకొని విశాఖకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఒక బస్సు పైడిభీమవరం వద్దకు రాగానే, స్థానికంగా ఉన్న ఓ కంపెనీకి చెందిన బస్సు టూరిస్టు బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
దిల్లీలో అగ్నిప్రమాదం, అదే సమయంలో కూలిన భవనం
Here's ANI Tweet
అయితే టూరిస్టు బస్సు వోల్వో బస్సు కావడం, దాని ఇంజన్ బస్సుకు వెనుక భాగంలో ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే టూరిస్టు బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సు పూర్తిగా దగ్దమైంది. మంటలు వ్యాపించడంతో.. కంపెనీకి చెందిన ఉద్యోగులు వెంటనే టూరిస్టు బస్సులో ఉన్న వారిని కిందకు దించడంతో ప్రాణనష్టం తప్పింది.
మాంసపు ముద్దలుగా శరీరాలు, 43 మంది మృతి
భక్తులను విశాఖకు (Visakhapatnam)తరలించి, అక్కడి నుంచి ట్రైన్ ద్వారా వారి స్వస్థలాలకు పంపించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.