​​Visakhapatnam Shocker: విశాఖలో విషాదం, తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న విశాఖ అరకు పోలీసులు

పిల్లలన బుజ్జగించి లాలించాల్సిన తల్లే పిల్లల పాలిట యమపాశంలా మారినట్లు ఘటన బట్టి తెలుస్తోంది. పిల్లలను చంపేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా (Mother and three children are Ends their Life ) వార్తలు వస్తున్నాయి.

Representational Image (Photo Credits: File Image)

​​Visakhapatnam, July 17: విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలన బుజ్జగించి లాలించాల్సిన తల్లే పిల్లల పాలిట యమపాశంలా మారినట్లు ఘటన బట్టి తెలుస్తోంది. పిల్లలను చంపేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా (Mother and three children are Ends their Life ) వార్తలు వస్తున్నాయి. అరకులోయ (Araku Valley area) పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో వివాహిత, ఆమె ముగ్గురు బిడ్డలు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ఆమె ముగ్గురు బిడ్డలు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ముగ్గురు బిడ్డలను ఆస్పత్రికి తండ్రి తీసుకువెళ్లినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్‌ (10), కుమారులు సర్విన్‌ (8), సిరిల్‌(4)లతో కలిసి పాత పోస్టాఫీస్‌ కాలనీలో నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా మంచంపై విగతజీవులుగా ఉన్న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో హుటాహుటిన ఏరియా అస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

అనాథనంటూ..ముగ్గురుని పెళ్లి చేసుకున్న యువతి, మామకు మాయమాటలు చెప్పి రూ. 2 లక్షలతో పరార్, ఎట్టకేలకు యువతిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు

తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని సీఐ జి.డి.బాబు, ఎస్‌ఐ నజీర్‌ తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలు చూసి చలించిపోయారు.