Representational Image (Photo Credits: Pexels)

Chittoor, July 14: ఏపీలో చిత్తూరులో పెళ్లి పేరుతో పలువురిని మోసం (Young Woman Cheating Man) చేసి పరారీలో ఉన్న యువతిని మంగళవారం అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ కథనం ప్రకారం.. విజయపురం మండలం నాగరాజకండ్రిగ కు చెందిన సునీల్‌కుమార్‌(29) మార్కెటింగ్‌ ఉద్యోగం చేసుకుంటూ తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివస్తున్నాడు. ఇతనికి ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే ఎం.సుహాసినితో కలిగిన పరిచయం కొద్ది రోజులకు ప్రేమకు దారితీసింది.

గత ఏడాది డిసెంబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాను అనాథనని చెప్పడంతో సునీల్‌కుమార్‌ కుటుంబ పెద్దలు సుహాసినికి 20 గ్రాముల బంగారం ఇచ్చారు. పెళ్లైన తర్వాత మామ అయిన సునీల్‌ తండ్రికి ఆమె మాయమాటలు చెప్పి వద్ద మరో రూ.2లక్షలు తీసుకుంది. విషయం తెలుసుకున్న సునీల్‌ నిలదీయంతో జూన్‌ 8వ తేదీన ఇంట్లో నుంచి జారుకుంది. ఆమె ఆధార్‌ కార్డు ఆధారంగా విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై ఒక కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది.

బరితెగించిన హిజ్రాలు, నగ్నంగా రోడ్డుపై పడుకుని..పెళ్లి బృందం వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్, అడిగినంత ఇవ్వలేదని రాళ్లతో దాడి, కేసు నమోదు చేసిన అనంతపూర్ బత్తలపల్లి పోలీసులు

అలాగే ఏడాది క్రితం మరో వ్యక్తిని కూడా ఇలాగే మోసం (Chittoor Love Cheating) చేసినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు జూన్‌ 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం తిరుపతి స్విమ్స్‌ వద్ద వివేకానంద సర్కిల్‌లో సుహాసినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.