Hijras / For representational purposes (Photo | PTI)

Anantapur, July 13: ఏపీలోని అనంతపురంలో హిజ్రాలు (Hijras) ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఏకంగా పెళ్లి బృందంపై దాడి చేసి గాయపరిచారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు రక్తమోడిన గాయాలతో (Hijras Attack) ఆస్పత్రి పాలయ్యారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మంగళవారం సాయంత్రం బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో నార్పల మండలం బొందలవాడ నుంచి పెళ్లి బృందంతో బొలెరో వాహనం వచ్చింది.

హిజ్రాలు దాన్ని ఆపి పెద్ద మొత్తంలో వారి వద్ద నుంచి డబ్బు డిమాండ్‌ (demanded money) చేశారు. అయిత వారు అంత ఇవ్వలేమంటూ కొంత మొత్తాన్ని ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన మేరకు తీసుకునేందుకు హిజ్రాలు ససేమిరా అన్నారు. అంతటితో ఆగకుండా అడిగినంత ఇవ్వలేదని రాళ్లతో దాడికి (Hijras Attack on Bridal Party) తెగబడ్డారు. ఈ ఘటనలో పెళ్లి బృందంలోని బయన్న, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, రామాంజినమ్మ, ఆదెమ్మ, సింహాద్రి, శివయ్య, బాలుడు చిన్న గాయపడ్డారు.

పంటను రక్షించుకునేందుకు రైతు సరికొత్త ప్రయోగం, స్ప్రింగ్ సాయంతో బొమ్మను అటూ ఇటూ కదులుతూ పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

అతి కష్టంపై వారి బారీ నుంచి బయటపడిన పెళ్లి బృందం.. బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. తర్వాత గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఇక అక్కడతో ఆగని హిజ్రాలు అక్కడి నుంచి పోట్లమర్రికి చేరుకున్న హిజ్రాలు వివస్త్రలుగా మారి రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించి వేశారు.

అయితే పోలీసులు నుంచి తప్పించుకున్న అనంతరం బత్తలపల్లికి చేరుకున్న ఈ హిజ్రాలు మద్యం మత్తులో వివస్త్రలుగా మారి కూడలిలో నిలబడి అసభ్యపదజాలంతో దూషణలు మొదలుపెట్టారు. దీంతో మళ్లీ పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాశి, లావణ్య, మురళి, దుర్గ, శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.