Treasury Employee Corruption: అనంతపురంలో రూ.3 కోట్ల అవినీతి బట్టబయలు, ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ అవినీతి ఖజానా మీద స్పెషల్ కథనం

మొత్తం అవినీతి ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే (Treasury Employee Massive Corruption) ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్‌ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి.

Andhra Pradesh Police. (Photo Credits: ANI | Twitter)

Anantapur, August 20: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ అవినీతి (Treasury Employee Corruption) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొత్తం అవినీతి ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే (Treasury Employee Massive Corruption) ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్‌ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి.

వీటితో పాటు ఒక ఎయిర్‌ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్‌ శాఖ ఓఎస్‌డీ రామకృష్ణ ప్రసాద్‌ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును (Anantapur Treasury Corruption) స్వాధీనం చేసుకుని.. మనోజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు.

AP Police seized his Corruption Assets :

మనోజ్‌కుమార్‌ (Manoj Kumar) వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ ప్రసాద్, సీసీఎస్‌ సీఐ శ్యామ్‌రావులతో కలిసి రంగంలోకి దిగారు. మనోజ్‌కుమార్‌ డ్రైవర్‌ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా, ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కూడా వర్తింపు

అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తి సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఇటీవల సీసీఎస్‌ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్‌ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందాలు డ్రైవర్‌ నాగలింగను అరెస్ట్‌ చేశారు. నాగలింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయంత్రం అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి.

మనోజ్‌ అనంతపురంలోని సాయినగర్‌ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్‌ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ మరణించాడు. తండ్రి పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద మనోజ్‌ కుమార్‌కు 2006 నవంబర్‌ 17న ట్రెజరీ శాఖలో జూనియర్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. రెండు మూడేళ్లకే అతడు కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరునిగా పేరొందాడు.

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 14 ఏళ్లుగా ఇతను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ కాగా.. రాత్రికి రాత్రి రద్దు చేయించుకుని తిరిగి అదే స్థానానికి వచ్చాడు. గత ఏడాది జూలైలో ధర్మవరం సబ్‌ ట్రెజరీకి బదిలీ రాగా.. 6 నెలలు పాటు సెలవులో వెళ్లి, తిరిగి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేయించుకోవడం ఆశ్చర్యపరిచే అంశం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif