Amaravati, August 20: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (AP Govt) అన్ని వర్గాలకు అనుగుణంగా తన నిర్ణయాలను తీసుకుంటూ వెళుతోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు (APRTC Employees) జగన్ సర్కారు శుభవార్తను అందించింది. అర్టీసీ కార్మికులకు కరోనా బీమా (Covid Insurance to RTC Employees) వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. కార్మిక పరిషత్ నేతలు ఆగస్టు 19న ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును (APSRTC MD Krishna Babu) కలిసి బీమా కల్పించాలంటూ కార్మికులు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కరోనాతో ఇప్పటివరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకోసం మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఏండీ కృష్ణబాబు జిల్లాల ఆర్‌ఎంలను ఆదేశించారు. దీంతో కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాల కార్మికులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 5.65 శాతం మందికి కరోనా పరీక్షలు చేసింది. ఒక మిలియన్ జనాభాకు 56, 541 టెస్టులతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి వరకు మొత్తం 30,19, 296 టేస్టులు జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.