Amaravati. August 20: ఏపీలో వినాయక చవితి వేడుకలపై వైయస్ జగన్ సర్కారు ( YS Jagan Govt) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం (Govt issues guidelines) ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తాజా ఆదేశాల్లో బహిరంగ ప్రదేశాలకు బదులుగా ఇళ్ల వద్దే ప్రజలు వినాయక చవితి వేడుకలు (Ganesh Chaturthi 2020) జరుపుకోవాలని సూచించింది. అలాగే పండుగ సామాగ్రి కొనేటప్పుడు మార్కెట్లోనూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలపై ఆంక్షలు ఉన్నందున చవితి సామాగ్రి కొనుగోలుకు ప్రజలు మార్కెట్లో ఎగబడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో మార్కెట్లలోనూ తప్పనిసరిగా ఆంక్షలు అమలు చేస్తారు. పూజా సామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేబినెట్ భేటీలో ఏపీ సీఎం పలు కీలక నిర్ణయాలు, వైఎస్సార్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం, డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం
మరోవైపు ఏపీలో వినాయక చవితి వేడుకలను అడ్డుకోవద్దని విపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేసింది. చవితి వేడుకలను మతం కోణంలో చూడొద్దంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
Update by ANI
Government of Andhra Pradesh issues guidelines for the celebration of Ganesh Chaturthi on 22nd August; advises citizens to perform 'pooja' in their houses instead of public places.
— ANI (@ANI) August 20, 2020
కానీ ప్రస్తుతం కరోనా పరిస్ధితుల్లో వేడుకలకు అనుమతిస్తే వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విగ్రహాలు పొడవు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధాని అంశం అసలు మా పరిధిలో లేనే లేదు, హైకోర్టు నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం, మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు
కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో అధికారు పాల్గొన్నారు. వినాయక చవితికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు. నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని పరోక్షంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ప్రజలందరూ సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
హైదరాబాద్‌లో మండపాలకు అనుమతి లేదు : ప్రభుత్వం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనం ఉండడం లేదు. బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఇంట్లోనే వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలి. కరోనావైరస్ కారణంగా బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు వద్దు. ఎక్కడా వినాయక మండపాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవు. ప్రజలు సహకరించాలి'' అని ఆయన చెప్పారు.